హైదరాబాద్ : కడప జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా..మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మైలవరం మండలం కర్మలవారిపల్లి దగ్గర చోటు చేసుకుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm