హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున సిద్ధార్థ్‌నగర్ వద్ద ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను గోరఖ్‌పూర్ దవాఖానకు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. వివాహ వేడుకకు వెళ్లివస్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నదని తెలిపారు. ప్రమాద సమయంలో కారులో 11 మంది ఉన్నారని వెల్లడించారు.
ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో మృతిచెందినవారికి రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేలు ఆర్థికసాయం ప్రకటించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 22 May,2022 12:30PM