హైదరాబాద్ : ఉత్తరాది పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. లంచ్‌మీటింగ్‌కు ఆహ్వానించడంతో సీఎం కేసీఆర్.. కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆప్ జాతీయ కన్వీనర్‌ను కేసీఆర్ శాలువాతో సత్కరించారు. భేటీ సందర్భంగా ఇరువురు నేతలు జాతీయ రాజకీయాలు, సమాఖ్య స్ఫూర్తి, దేశ ప్రగతిలో రాష్ట్రాల పాత్ర, కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చించే అవకాశం ఉన్నది. దేశాభివృద్ధికి కొత్త ఎజెండా రూపకల్పన గురించి చర్చించనున్నారు. మధ్యాహ్నం భోజనం తర్వాత ఇద్దరు సీఎంలు చండీగఢ్ వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ బృందంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm