న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిశారు. ఈ మేరకు పలు అంశాలపై వారు చర్చించినట్టు తెలిసింది. అనంతరం ఇద్దరు కలిసి చండీగఢ్ వెళ్లనున్నారు. సాగు చట్టాలపై పోరులో అమరులైన రైతు కుటుంబాలను పంజాబ్ సీఎం భగవంత్‌సింగ్ మాన్తో కలిసి వారు పరామర్శించనున్నారు. అలాగే బాధిత కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.3 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించనున్నారు. 600 కుటుంబాలకు కేసీఆర్ చేయూతనందిస్తారు.
Mon Jan 19, 2015 06:51 pm