హైదరాబాద్ : ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్‌లు తమ మొదటి మంకీపాక్స్ కేసులను తాజాగా ధృవీకరించాయి. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలకు చెందిన ఈ వ్యాధిని గుర్తించడంలో అనేక యూరోపియన్, ఉత్తర అమెరికా దేశాలు చేరాయి. ఇటీవల యూకె, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్ మరియు స్వీడన్‌లతో పాటు అమెరికా, కెనడా , ఆస్ట్రేలియాలో 100 కంటే ఎక్కువ మంకీపాక్స్‌కు సంబంధించిన కేసులు ధృవీకరించబడిన లేదా అనుమానిత కేసులు బయటపడ్డాయి.
మంకీపాక్స్ లక్షణాలతో ఇటీవల పశ్చిమ ఐరోపా నుండి తిరిగి వచ్చిన 30 ఏండ్ల వ్యక్తికి మంకీపాక్స్ వైరస్ పాజిటివ్ వచ్చిందని టెల్ అవీవ్ ఇచిలోవ్ హాస్పిటల్ ప్రతినిధి తెలిపారు. ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, ఆ వ్యక్తి విదేశాలలో కోతుల వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి వల్ల వ్యాధికి గురయ్యాడు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 22 May,2022 02:38PM