హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తన దృష్టికి వచ్చిన రెండు అంశాలపై ఈ లేఖ రాస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్వగ్రామంలో అభివృద్ధి మచ్చుకైనా కానరావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస సౌకర్యాలకు కూడా ఆ గ్రామం నోచుకోవడం లేదని, పరిస్థితులు అధ్వానంగా మారాయని అన్నారు. ఇప్పటికీ ఆ గ్రామానికి రెవెన్యూ గ్రామం హోదా లేదని తెలిపారు. దీన్ని బట్టే తెలంగాణ ఉద్యమ రూపకర్త అయిన జయశంకర్ సార్ పై మీకు ఎంత విద్వేషం, వ్యతిరేక భావం ఉందో అర్థమవుతోందని సీఎం ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. అధికార మదంతో జయశంకర్ సారుకు గుర్తింపు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పుట్టిన ఊరికి కూడా గుర్తింపు రాకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా నీళ్లిస్తున్నామంటూ చెప్పుకోవడం కాదని, అక్కంపేటలో ఏ ఇంటికీ నల్లా నీళ్లు రావడం లేదని చెప్పారు. వెంటనే ఆ ఊరికి నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
ఇక వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ కోసం కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (కుడా) ల్యాండ్ పూలింగ్ విధానంలో భూసేకరణకు సిద్ధమైందని తెలిపారు. వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని 27 గ్రామాల్లో ఉన్న 21,517 ఎకరాల భూములను సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని, ఫలితంగా లక్ష మందికిపైగా రైతులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, కానీ, అభివృద్ధి పేరిట పచ్చని పొలాల్లో చిచ్చు మాత్రం పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. రైతుల జీవితాలను నాశనం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ల్యాండ్ పూలింగ్ జీవోను వెనక్కు తీసుకుంటున్నట్టు కింది స్థాయి నేతలు చెబుతున్నా రైతులకు నమ్మకం కలగడం లేదని, కాబట్టి సీఎం హోదాలో కేసీఆరే ఆ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 22 May,2022 02:43PM