చెన్నై : కేంద్ర ప్రభుత్వం శనివారం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన సంగతి తెలిసిందే. పెట్రోల్ లీటర్ పై రూ.8, డీజిల్ లీటర్ పై రూ.6 ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై తమిళనాడు ఆర్థికమంత్రి త్యాగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ..
పెట్రో ధరలు పెంచినప్పుడు మమ్మల్ని అడిగి పెంచారా అంటూ నిలదీశారు. మరి అలాంటప్పుడు పన్నులు తగ్గించాలని తమనెలా అడుగుతారు అని ప్రశ్నించారు. ఇప్పుడు కేంద్రం కూడా గతంలో పెంచిన ధరల నుంచి కొద్దిగా తగ్గించారని చెప్పారు. గతంలో ఇంధన ధరలు పెంచినప్పుడు ఏనాడూ రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం తీసుకోలేదని, ఇప్పుడు పన్నులు తగ్గించాలంటూ రాష్ట్రాలకు చెబుతోందని, ఇది సమాఖ్య స్ఫూర్తి అనిపించుకుంటుందా? అని ప్రశ్నించారు.
నవంబర్ 2021లో కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన పన్ను తగ్గింపు కారణంగా తమ రాష్ట్రం ఇప్పటికే రూ. 1,000 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూస్తోందని అన్నారు. శనివారం పన్ను తగ్గింపు ప్రకటించినప్పటికీ, 2014తో పోలిస్తే రేట్లు ఇంకా ఎక్కువగానే ఉన్నాయని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 22 May,2022 03:28PM