హైదరాబాద్ : వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. తీవ్రమైన గుండెనొప్పితో పరిగి ఆస్పత్రికి వచ్చిన ఓ బాధితున్ని పట్టించుకునే వారే కరువయ్యారు. అక్కడ వైద్యులు, వైద్య సిబ్బంది ఎవరూ కనిపించలేదు. 50 పడకలు ఉన్న ఆస్పత్రిలో కేవలం ఒక్క నర్సు ఉండటం గమనార్హం.
వివరాల్లోకెళ్తే.. కిష్టమ్మగుళ్ల తాండకు చెందిన సోమ్లా నాయక్ కు ఆదివారం గుండెనొప్పి వచ్చింది. దాంతో అతను తన కుటుంబసభ్యుల సాయంతో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాడు. అయితే అక్కడ వైద్యులెవరూ లేరు. ఒకే నర్సు ఉంది. దాంతో ఆస్పత్రి బెడ్‌పైనే బాధితుడు పడుకుని నొప్పితో గిలగిలా కొట్టుకోవడం కలచివేసింది. దాంతో నర్సు.. వైద్యులను సంప్రదించేందుకు ప్రయత్నించింది. కానీ వారి ఫోన్లు స్విచ్ఛాఫ్వారి వచ్చినట్టు తెలిసింది. దాంతో నర్సే.. బాధితుడికి ఈసీజీ తీసీ పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలని బాధితుడి కుటుంబసభ్యులకు సూచించింది. అనంతరం కుటుంబసభ్యులు.. అంబులెన్స్ మాట్లాడుకుని బాధితున్ని వికారాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.
అలాగే, అదే సమయంలో పురిటినొప్పులతో ఓ గర్భిణి ఆ ఆస్పత్రికి వచ్చింది. అయితే ఆస్పత్రిలో ఎవరూ లేకపోవడంతో.. విధుల్లో ఉన్న నర్సు సెలవులో ఉన్న మరో నర్సును అప్పటికప్పుడు పిలిపించి చికిత్స అందించారు. ఇలా ఉదయం నుంచి ఎంతో మంది రోగులు.. వైద్యులు లేకపోవడంతో నిరాశతో వెనక్కు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని రోగుల కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 22 May,2022 04:13PM