హైదరాబాద్ : జీవిత దర్శకత్వంలో రాజశేఖర్ నటించిన 'శేఖర్` చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే సిటీ సివిల్ కోర్టు ఆదేశాల మేరకు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శనలు నిలిపివేశారు. ఈ చిత్రానికి సంబంధించి జీవిత రాజశేఖర్.. 65 లక్షలు చెల్లించాలంటూ ప్రముఖ ఫైనాన్షియర్ పరందామరెడ్డి కోర్టును ఆశ్రయించారు. 48 గంటల్లో ఆ డబ్బును డిపాజిట్ చేయాలని.. లేని పక్షంలో చిత్ర ప్రదర్శనలు నిలిపివేయాల్సి వస్తుందని కోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే గడువు ముగిసే సమయానికి డబ్బు డిపాజిట్ చేయని కారణంగా శేఖర్ చిత్ర ప్రదర్శనలను నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.
Mon Jan 19, 2015 06:51 pm