ముంబై : పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం రెండు నెలల్లో రూ. 18 పెంచి ఇప్పుడు కేవలం రూ. 8 మాత్రమే తగ్గించిందని.. ఇదేమంత భారీ తగ్గింపు కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌థాకరే అన్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం పెట్రోలు, డీజిల్ ధరలు ఎంతెంత ఉన్నాయో ఆ మేరకు తగ్గిస్తేనే వినియోగదారులకు నిజమైన ఉపశమనమని అన్నారు. పెట్రోల్, డీజీల్‌పై కేంద్రం తగ్గించిన ఎక్సైజ్ సుంకం ఏమాత్రం సరిపోదని, ఇంధన ధరలను తగ్గించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంధనంపై ధరలను విపరీతంగా పెంచి.. ఇప్పుడు కనీస తగ్గింపును ఇవ్వడం సరికాదని అన్నారు. రెండు నెలల క్రితం కేంద్రం పెట్రోల్ ధరను లీటర్‌కు రూ.18.42 పెంచిందని, కానీ, ఈరోజు కేవలం రూ.8 తగ్గించిందని, అదేవిధంగా డీజీల్ ధర లీటర్‌కు రూ.18.24 పెంచింది, ఇప్పుడు కేవలం రూ.6లు తగ్గించిందని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm