విజయవాడ: హీరోలు చిరంజీవి, పవన్‌కళ్యాణ్, రామ్‌చరణ్ అభిమానులు విజయవాడలోని ఓ హోటల్‌లో ఆదివారం సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో రాజకీయాలపై మెగా అభిమానులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వెంట నడవాలని 'మెగా` అభిమానులు నడవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో వారు పలు కీలక అంశాలపై చర్చించారు.
అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామినాయుడు విలేకరులతో మాట్లాడుతూ.. మెగా అభిమానులంతా జనసేన కార్యకర్తలుగా పని చేస్తారని తెలిపారు. జనసేనను జనంలోకి తీసుకెళ్లేలా తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ప్రతి గ్రామంలో అందరూ కలిసి పని చేయాలని నిర్ణయించామన్నారు.మరికొన్ని సమావేశాలు అనంతరం కార్యాచరణ సిద్దం చేస్తామని.. అభిమానులకు, నాయకులకు మధ్య అంతరాలు లేవన్నారు. పొత్తుల అంశం తమ పరిధి కాదని.. పెద్దలు నిర్ణయిస్తారన్నారు. గతంలో ప్రజారాజ్యంపై అనేక కుట్రలు చేశారని.. కుటుంబాలు వదిలి ఆనాడు చిరంజీవి కోసం పని చేశామన్నారు. ఇప్పుడు జనసేన పై అసత్యాలు, పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం కావడం కోసం అందరూ సంకల్పంతో పని చేయాలన్నారు. 2024లో పవన్‌కళ్యాణ్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా తాము ముందుకు సాగుతామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 22 May,2022 04:43PM