సిడ్నీ : ఆస్ట్రేలియాలో శనివారం ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అక్కడి లేబర్ పార్టీ.. లిబరల్ పార్టీని ఓడించింది. దాంతో దేశ కొత్త ప్రధానిగా ఆంటోని ఆల్బనీస్ కానున్నారు. ఇదిలా ఉండగా పోలింగ్ సమయంలో చాలా మంది ప్రజలు కేవలం అండర్ వేర్స్‌లో వెళ్లి ఓట్లు వేయడం సంచలనంగా మారింది.
వివరాల్లోకెళ్తే.. ఆస్ట్రేలియాలో జరిగే ఎన్నికల్లో ప్రజలు అండర్ వేర్‌తో ఓటేస్తూ ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తే వారికి తమ కంపెనీ నుంచి స్విమ్ వేర్‌ను ఉచితంగా ఇస్తామని బడ్జీ స్మగ్లర్స్ అనే కంపెనీ ప్రకటించింది. అందుకు బాగా స్పందన వచ్చింది. వందలాది మంది రంగు రంగుల అండర్‌వేర్స్‌ను ధరించి ఓటు వేశారు. సంబంధిత ఫోటోలను #SmugglersDecide హ్యాష్ టాగ్‌తో షేర్ చేశారు. దీనిపై కంపెనీ స్పందిస్తూ.. తాము ఇచ్చిన ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చిందని తెలిపారు. ఓటు వేసిన వారందరికీ గిఫ్ట్‌లు పంపిస్తామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 22 May,2022 04:52PM