హైదరాబాద్ : నకిలీ సందేశాలపై ఎస్‌బీఐ ఖాతాదారులకు కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. 'మీ ఎస్ బీఐ ఖాతా బ్లాక్ చేయబడింది... సంబంధిత వివరాలతో మళ్లీ మీ ఖాతాను పునరుద్ధరించుకోండి` అనే ఓ మెసేజ్ ఇటీవల చాలా మందికి వస్తోందని తెలిపింది. ఆ మెసేజ్ తో పాటే ఓ లింకు కూడా ఉంటోందని పేర్కొంది. అయితే అది నకిలీ మెసేజ్ అని, దాంతో జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ మేరకు ట్వీట్ చేసింది. ఎస్ బీఐ తన ఖాతాదారులకు ఎప్పుడూ ఇలాంటి సందేశాలు పంపదని, ఒకవేళ మీ ఫోన్లకు, మెయిల్ కు ఈ తరహా సందేశాలు వస్తే అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకు ఖాతా, పర్సనల్ వివరాలను చెప్పొద్దని హెచ్చరించింది. ఈ ఫేక్ మెసేజ్ ఎవరికైనా వస్తే వెంటనే [email protected] కు మెయిల్ చేయాలని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ట్వీట్ లో పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm