అమరావతి : కరోనా వైరస్ నేపథ్యంలో చాలా కంపెనీలు తమ సాఫ్టవేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఉద్యోగులు ఆఫీసులకు రావాలని కొన్ని కంపెనీలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. అయితే వర్క్ ఫ్రం హోంకు అలవాటు పడిన ఉద్యోగులు ఇప్పుడు ఆఫీసులకు వెళ్లాలంటే మనస్తాపం చెందుతున్నారు. ఆ మనాస్తాపంతోనే తాజాగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఏపీలోని అనకాపల్లిలో జరిగింది.
ఎస్‌ఐ ఎల్.రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన నగిరెడ్డి నవీన్‌వెంకట్(23)కు ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అయితే వర్క్ ఫ్రం హోం కావడంతో అతను ఇంటి నుంచే పనిచేస్తున్నాడు. అయితే అతను హైదరాబాద్ కు రావాలని ఇటీవల కంపెనీ యాజమాన్యం సూచించింది. అయితే తల్లిదండ్రులను విడిచి వెళ్లడానికి ఇష్టపడని యువకుడు శనివారం తన తాతయ్య, నానమ్మ ఉంటున్న గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 22 May,2022 05:22PM