ముంబై: ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) కం మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా సలీల్ పరేఖ్ తిరిగి నియమితులయ్యారు. ఐదేండ్ల కాలానికి సలీల్ పరేఖ్‌ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా తిరిగి నియమించాలని నిర్ణయించినట్లు ఇన్ఫోసిస్ బోర్డు ఆదివారం ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. పరేఖ్ పునరుద్ధరించబడిన పదవీకాలం జూలై 1, 2022 నుండి మార్చి 31, 2027 వరకు ఉంటుందని కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్‌లో తెలిపింది. దీనికి సంస్థ వాటాదారుల ఆమోదం లభించాల్సి ఉందని పేర్కొంది.
సలీల్ పరేఖ్‌కు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లోని ఏ సభ్యుడితోనూ సంబంధం లేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్టాక్ ఎక్స్ఛేంజీలు ఎప్పటికప్పుడు జారీ చేసే సర్క్యులర్‌లతో సహా వర్తించే చట్టాల ప్రకారం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా తిరిగి నియమించబడే అన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉంటారని గమనించాలని పేర్కొన్నారు.
సలీల్ పరేఖ్ 2018 జనవరి నుంచి గత నాలుగేండ్లుగా ఇన్ఫోసిస్ సీఈవో కం ఎండీగా విజయవం తంగా సంస్థకు సారధ్యం వహించారు. అంతర్జాతీయంగా ఐటీ సేవల రంగంలో 30 ఏండ్లకు పైగా అనుభవం కలిగిన వ్యక్తి. ఇంతకుముందు క్యాప్‌జెమినీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా పని చేశారు. క్యాప్‌జెమినీలో 25 ఏండ్లపాటు వివిధ క్యాటగిరీల్లో నాయకత్వ పాత్ర పోషించారు. సలీల్ ఎర్నెస్ట్ అండ్ యంగ్‌లో భాగస్వామిగా కూడా ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 22 May,2022 05:29PM