హైదరాబాద్ : జీవిత దర్శకత్వంలో యాంగ్రీ హీరో రాజశేఖర్ హీరోగా నటించిన శేఖర్ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే కోర్టు ఆదేశాలతో తెలుగు రాష్ర్టాల్లోని థియేటర్లలో శేఖర్ చిత్రాన్ని నిలిపివేశారు. అయితే దీనిపై రాజశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు. తన శేఖర్ చిత్రానికి వ్యతిరేకంగా కొందరు కుట్రలు చేసి, చిత్ర ప్రదర్శనలు నిలిపివేయించారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
'శేఖర్ చిత్రాన్ని నేను, నా కుటుంబం మా సర్వస్వంగా భావించాం. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేం ఎంతో కష్టపడ్డాం. శేఖర్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కానీ, కొందరు కావాలనే మా చిత్రాన్ని అడ్డుకుంటున్నారు. సినిమాయే మా లోకం. ముఖ్యంగా ఈ శేఖర్ చిత్రంపై తాము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఇక నేను చెప్పాల్సిందేమీ లేదు.. ఎవరెన్ని చేసినా ఈ చిత్రం ప్రదర్శితమై, ప్రశంసలు పొందుతుందని, ఆ అర్హత ఈ సినిమాకు ఉందని నేను భావిస్తున్నాను` అంటూ రాజశేఖర్ పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 22 May,2022 05:38PM