హైదరాబాద్ : వరుడికి బట్టతల ఉందని పెండ్లి మండపంలో తెలుసుకున్న వధువు ఆ పెండ్లిని ఆపేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే.. వరుడికి బట్టతల ఉంది. అయితే, పెండ్లిచూపులకు అతను విగ్గుపెట్టుకొని వచ్చాడు. అనంతరం వివాహం నిశ్చయమైంది. అయితే వివాహం జరిగే రోజు వరుడు మండపంలోకి వెళ్లేముందు అతనికి తల తిరగడంతో స్పృహతప్పి పడిపోయాడు. అతను నేలపై పడిపోవడంతో అతని విగ్ బయటకు వచ్చింది. దాంతో అతనికి బట్టతల ఉన్నట్టు అందరు గుర్తించారు. విషయం తెలుసుకున్న వధువు పెండ్లికి నిరాకరించింది. వధువును ఒప్పించేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు ప్రయత్నించినా ఆమె మాత్రం తన వైఖరిపై పట్టుదలతో ఉంది. విషయం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అయితే పోలీసులు జోక్యం చేసుకున్న తర్వాత కూడా వధువు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.
అనంతరం పంచాయతీ నిర్వహించగా.. పెండ్లికి రూ.5.66 లక్షలు ఖర్చు చేసినట్లు యువతి కుటుంబ సభ్యులు తెలిపారు. వరుడి తరపు వారు వారి డిమాండ్లను అంగీకరించి, వధువు తండ్రికి డబ్బును తిరిగి ఇచ్చారు. ఇక పెండ్లికూతురును ఒప్పించేందుకు ప్రయత్నించినా ఆమె అంగీకరించలేదని పరియార్ పోలీస్ అవుట్ పోస్ట్ ఇన్‌ఛార్జ్ రామ్‌జీత్ యాదవ్ తెలిపారు. అనంతరం ఇరువర్గాల మధ్య రాజీ కుదిరిందని అధికారి తెలిపారు. పెండ్లి కూతురు మేనమామ మాట్లాడుతూ.. బట్టతల ఉన్న విషయాన్ని వరుడి కుటుంబీకులు దాచిపెట్టకూడదన్నారు. వరుడు బట్టతల గురించి తమకు చెబితే, తాము వధువును మానసికంగా సిద్ధం చేయగలమని తెలిపారు. వివాహం అబద్ధంతో ప్రారంభమవుతుందని మీరు ఆశించలేరు అని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 22 May,2022 05:51PM