హైదరాబాద్ : స్వదేశంలో జూన్ 9 నుంచి దక్షిణాఫ్రికాతో జరుగబోయే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం అలాగే ఇంగ్లండ్‌లో జరిగే ఏకైక టెస్ట్ కోసం భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. అయితే రోహిత్, కోహ్లీ సహా పలువురు సీనియర్లకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. కేఎల్ రాహుల్‌ను కెప్టెన్ గా, రిషబ్ పంత్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఇక ఐపీఎల్ లో అత్యధిక వేగంతో బౌలింగ్ వేస్తున్న ఉమ్రాన్ మాలిక్ భారత జట్టుకు సెలక్ట్ అయ్యాడు.
ఇక జూలై 1 నుంచి బర్మింగ్‌హమ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే రీ షెడ్యూల్డ్ ఐదో టెస్ట్ కోసం కూడా జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ను నియమించారు. ఈ జట్టులో తెలుగు కుర్రాడు కేఎస్ భరత్‌కు చోటు దక్కింది.
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
భారత టెస్ట్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 22 May,2022 06:32PM