హైదరాబాద్ : తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘానికి అధ్యక్షుడిగా రాష్ర్ట మంత్రి కేటీఆర్ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. తాజాగా తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘానికి ఆదివారం ఎన్నికలు నిర్వహించగా ఆయన ఏకగ్రీవమయ్యారు. ఇక బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శిగా పుల్లెల గోపీచంద్ ఎన్నికయ్యారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా యుగంధర్ రావు, వైస్ ప్రెసిడెంట్ గా చాముండేశ్వరినాథ్, కోశాధికారిగా పాణీరావు ఎన్నికయ్యారు. హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో ఎఫ్ఎన్ సీసీ క్లబ్ లో ఈ ఎన్నికలు నిర్వహించారు.
Mon Jan 19, 2015 06:51 pm