హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో బిచ్చగాడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 17న రాయదుర్గం పరిధిలోని షేక్‌పేట్ ప్లై ఓవర్ పైన బిచ్చగాడు (సుమారు 40) రోడ్డు దాటుతున్న సమయంలో మెహిదిపట్నం నుండి గచ్చిబౌలి వెళ్తున్న గుర్తు తెలియని ఇన్నోవా వాహనం అతన్ని ఢీ కొట్టింది. దాంతో అతను తీవ్రంగా గాయపడాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరకొని క్షతగాత్రుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm