బెంగళూరు : కారులో మంటలు చెలరేగి నవ దంపతులు సజీవ దహనమైన విషాద ఘటన కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని ఆర్టీ నగర్కు చెందిన దంపతులు యశ్వంత్(23), జ్యోతి(23)లు మే 18న ఇంట్లో నుంచి వెళ్లారు. ఇంటర్వ్యూకి వెళ్తున్నట్లు జ్యోతి తన కుటుంబ సభ్యులతో తెలిపింది. అలాగే తరగతులకు హాజరయ్యేందుకు వెళ్తున్నట్లు యశ్వంత్ చెప్పాడు. శనివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో మంగళూరులోని ఓ ట్రావెల్ ఏజెంట్ వద్దకు వెళ్లి వారు కారు బుక్ చేసుకున్నారు. తీరం చుట్టూ తిరిగి, భత్కల్ వరకు ప్రయాణించి, బీచ్‌లను సందర్శించి, అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో మందర్తి ఆలయా నికి చేరుకున్నారు. తెల్లవారుజామున 3.05 గంటలకు హెగ్గుంజే గ్రామానికి చేరుకున్నారు. ఆ తర్వాత యశ్వంత్ తన సోదరుడికి సందేశం పంపాడు. అందులో తాను తీవ్ర చర్య తీసుకుంటున్నానని చెప్పాడు. లొకేషన్ కూడా పంపించాడు.
అయితే అప్పటికే వారు ఇంటికి రాకపోవడంతో హెబ్బల్ పోలీస్ స్టేషన్లో కుటుంబసభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఉడుపిలో ఆదివారం తెల్లవారు జామున ఓ కారు మంటల్లో కాలిపోతున్నట్టు స్థానికులు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే ఇద్దరు సజీవ దహనమైనట్లు పోలీసులు తెలిపారు. తమ జీవితాలను ముగిస్తున్నామని వారి తల్లిదండ్రులకు వారు సందేశం పంపించారని తెలిపారు. అయితే, వారి మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 22 May,2022 07:37PM