Obscure Words Deptt:
— Shashi Tharoor (@ShashiTharoor) May 22, 2022
Must the Indian Railways quomodocunquize? @RailMinIndia #SeniorCitizensConcession#IndianRailway pic.twitter.com/CAsGDaDKAf
హైదరాబాద్ : కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆంగ్ల భాషలో ఎంతో కష్టంగా ఉండే పలు పదాలను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరో పదాన్ని పరిచయం చేశారు. అదే quomodocunquize. ఆయనే ఆ పదానికి అర్థం కూడా వివరించారు. ఏ విధంగానైనా డబ్బు సంపాదించడం దీని అర్థం అట. వృద్ధులకు రైలు ప్రయాణాల్లో రాయితీపై రైల్వేశాఖను ప్రశ్నిస్తూ ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఈ పదాన్ని ఆయన ఉపయోగించారు. ఎలాగైనా సరే భారతీయ రైల్వే డబ్బులు సంపాదించాలని భావిస్తోందా? అని ప్రశ్నించారు.
ఇటీవల భారత రైల్వే శాఖ.. ఇప్పటికే టికెట్ల ధరలు తక్కువగా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ సిటిజన్లకు టికెట్ల ధరలపై రాయితీని పునరుద్ధరించలేమని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఎంపీ శశి థరూర్ ట్వీట్ చేశారు.