భోపాల్ : తల్లి అంత్యక్రియలకు తన సోదరుడు రాలేదని ఓ మహిళ అతడి కొడుకు పై హత్యాయత్నం చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లో శనివారం చోటుచేసుకుంది. బాలుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకెళ్తే.. భోపాల్ హనుమాన్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజీ క్యాంప్ లో
ని.. ఓ పదేండ్ల బాలుడు తన నాన్నమ్మ ఇంట్లో ఉంటున్నాడు. అయితే శనివారం ఆమె చనిపోయింది. ఆమె అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఝాన్సీ నుంచి భోపాల్‌కు మృతురాలి కొడుకు, కోడలు (బాలుడి తల్లిదండ్రులు) రాలేదు. దాంతో మృతురాలి కుమార్తె అస్మా ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షణికావేశంలో బాలుడిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. నిందితురాలిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు. బాలుడు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 22 May,2022 07:58PM