హైదరాబాద్ : అసోంలోనగావ్ జిల్లా బటద్రవా పోలీస్‌స్టేషన్‌పై కొందరు దుండగులు దాడి చేసి నిప్పంటించారు. దాంతో నిందితులను గుర్తించి, వారి ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేశారు. వివరాల్లోకెళ్తే.. బటద్రవా పోలీస్‌స్టేసన్ పరిధిలో ఓ కేసులో సఫీకుల్ అనే అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే అతను అనారోగ్యానికి గురికాగా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మూకుమ్మడిగా బటద్రవా పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో అధికార యంత్రాంగం.. నిందితులను గుర్తించి వారి అక్రమ నివాసాలను కూల్చివేయించింది. ఈ కేసుకు సంబంధించి 21 మందిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. సఫీకుల్ ఇస్లాం మృతిని తీవ్రంగా పరిగణిస్తున్నామని.. దీనికి బాధ్యతగా బటద్రాబా పోలీస్ స్టేషన్ పిఎస్‌ను సస్పెండ్ చేశామని అసోం డిజిపి పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన వారంతా మృతుని బంధువులు కారని, వారిలో కొంతమందికి గతలంలో నేర చరిత్ర ఉందని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm