హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రభుత్వ వైద్యుడు మృతి చెందాడు. ఎస్ఐ. తోట మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేట పట్టణం ఇంద్రానగర్ కి చెందిన కుదురుపాక రాజు (28) ములుగు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నారు.ఆయన బైక్ పై నెక్కొండలో జరిగిన వివాహానికి వెళ్లి తిరిగి నర్సంపేటకు వస్తున్నారు. ఈ క్రమంలో చెన్నారావుపేట మండలం రామన్నకుంట తండా శివారు వద్ద బైక్‌కి అడ్డంగా ఎద్దు వచ్చింది. దాంతో బైక్ అదుపుతప్పి ఎద్దుకు తగలడంతో రాజు తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంతో ఎద్దు కూడా చనిపోయింది.
Mon Jan 19, 2015 06:51 pm