పద్మ శ్రీ వనజీవి రామయ్యను ఫోన్లో పరామర్శించిన @PawanKalyan pic.twitter.com/3EdP6Glznj
— Phani Kandukuri (@buduggadu) May 22, 2022
హైదరాబాద్ : ప్రముఖ పర్యావరణ ప్రేమికుడు వనజీవి రామయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం వనజీవి రామయ్యకు వీడియో కాల్ చేసి పరామర్శించారు. రామయ్య ఆరోగ్య పరిస్థితి గురించి పవన్ అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యవంతులై తిరిగి రావాలని ఆకాంక్షించారు. త్వరలోనే కలుస్తానని తెలిపారు. ఈ సందర్భంగా వనజీవి రామయ్య స్పందిస్తూ.. జూన్ 5న పర్యావరణ దినోత్సవం అని, సీఎంను కలిసేందుకు హైదరాబాద్ వస్తున్నానని తెలిపారు. తన కుటుంబ సభ్యులను పవన్ కు పరిచయం చేశారు. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.