హైదరాబాద్ : వేసవి సెలవులు, ఆదివారం కావడంతో యాదాద్రిలో భక్తులు రద్దీ భారీగా పెరిగింది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ప్రధానాలయంలో పాటు పాతగుట్ట ఆలయంలో కూడా రద్దీ పెరిగింది. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖాజానాకు రూ.33,81,486 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంతో పాటు అనుబంధ పాతగుట్ట గుండం ఆంజనేయస్వామి వద్ద ఈ నెల 25న హనుమాన్ జయంతి నిర్వహించనున్నట్టు ఈవో తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm