హైదరాబాద్ : ఐపీఎల్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ(43), రొమారియో షెపర్డ్(26),వాషింగ్టన్ సుందర్(25) పరుగులతో రాణించారు. రాహుల్ త్రిపాఠి (20), మార్‌క్రమ్ (21)లు పర్వాలేదనిపించారు. అయితే వరుస వికెట్లు పడడంతో హైదరాబాద్ నామామాత్రపు స్కోరైనా చేస్తుందా అనిపించింది. అయితే చివరలో రొమారియో షెపర్డ్ ,వాషింగ్టన్ సుందర్ లు చెలరేగి బౌండరీలు కొట్టడంతో గౌరవప్రదమైన స్కోరు చేసింది. వారిద్దరూ ఏడో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. ఇక పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్,హర్‌ప్రీత్ బ్రార్ మూడు వికెట్లు పడగొట్టగా రబాడ ఒక్క వికెట్‌తీశాడు.
Mon Jan 19, 2015 06:51 pm