ముంబై : లోన్ యాప్ ఏజెంట్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. తాజాగా ఓ మహిళ నుంచి రూ.2,200 రుణం రికవరీ కోసం ఏజెంట్లు.. ఆమె ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరించారు. అంతేకాకుండా ఆ మహిళ బంధువులు, స్నేహితులకు వాటిని పంపారు. దాంతో బాధితురాలు.. పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగింది.
వివరాల్లోకెళ్తే.. విక్రోలి ప్రాంతానికి చెందిన 28 ఏండ్ల మహిళ రెండు లోన్ యాప్‌ల ద్వారా రూ.2,200 రుణం తీసుకుంది. అది తిరిగి చెల్లించేందుకు వారం రోజులు గడువు ఉంది. అయితే లోన్ రికవరీ ఏజెంట్లు నాలుగో రోజు నుంచే ఆమెకు ఫోన్లు చేసి రుణం తీర్చాలని బెదిరించారు. అలాగే ఆ మహిళ ఫొటోలు మార్ఫింగ్ చేసి కుటుంబ సభ్యులు, స్నేహితులకు పంపి దారుణంగా వ్యవహరించారు. దాంతో బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 22 May,2022 09:56PM