నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలోని సెర్ల దయానంద్ భాగ్యలక్ష్మి వినాయక్ నగర్ రోడ్ నెంబర్ 10 గృహంలో ప్రకృతి వింత 'మే` పుష్పాలు నాలుగు వికసించాయి. మే నెలలో మాత్రమే పూచే ఈ అరుదైన అరేబియన్ జాతి మొక్క ఇది. ఎండలు కాచే మే నెలలో ప్రకృతి కాస్త కరుణ చూపడంతో ప్రకృతి వింతైన మే పుష్పాలు నాలుగు వికసించినట్టు తెలుస్తోంది. ఎడారి ప్రాంతాలలో మే నెలలో మాత్రమే పుష్పించే ఈ పువ్వును ఫుట్ బాల్ పుష్ప మనీ బ్లడ్ లిల్లీ అని పిలుస్తారు. ఈ పుష్పం కోమ్మలు గాని ఆకులు గాని పనికిరావు అని తెలిసింది. కేవలం దీని గడ్డ భూమి లో నుండి మే నెల మూడవ వారంలో వికసించి 15 రోజుల తర్వాత పువ్వు రాలిపోతుంది. తిరిగి సంవత్సరం తర్వాత వికసిస్తుంది. చుట్టుపక్కల వారు వచ్చి ఈ పుష్పాన్ని చూసి ఆనందిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 23 May,2022 05:30PM