హైదరాబాద్ : రాజ్యసభ టీఆర్ఎస్ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయనకు సోమవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్నిక పత్రాన్ని అందజేశారు. రాజ్యసభ ఉప ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. అయితే సమాజ్‌వాదీ పార్టీకి చెందిన జాజుల భాస్కర్, స్వతంత్ర అభ్యర్థి భోరజ్ కొయాల్కర్ లు కూడా నామినేషన్లు వేయగా.. అవి సక్రమంగా లేని కారణంగా వాటిని తిరస్కరించినట్టు ఎన్నికల అధికారి తెలిపారు. దాంతో ఎవరూ పోటీ లేకపోవడంతో వద్దిరాజు రవిచంద్ర ఎన్నిక ఏకగ్రీవమైంది.
Mon Jan 19, 2015 06:51 pm