నవతెలంగాణ- తాడ్వాయి
అడవి పంది దాడిలో ఓ తునికాకు కూలి తీవ్రంగా గాయపడిన ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్వాయి మండలంలోని కాల్వపల్లి గ్రామానికి చెందిన 58 ఏండ్ల బడే బతకయ్య అనే ఆదివాసి గిరిజన తునికాకు కూలి. సోమవారం ఆయన అడవిలో తునికాకు సేకరిస్తూ ఉండగా ఆతని పై అకస్మాత్తుగా అడవి పంది దాడి చేసింది. ఈ దాడిలో సదరు తునికాకు కూలి కాలుకు తీవ్రంగా గాయమైంది. దాంతో అతనికి చికిత్స అందంచారు. ఆదివాసి, నిరుపేద తునికాకు కూలీ అయిన అతన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని ఆదివాసీ సంఘాలు కోరుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm