న్యూఢిల్లీ : ఢిల్లీ నూతన లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా వినయ్ కుమార్ సక్సేనా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అనుమతితో కేంద్ర ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చైర్ పర్సన్‌గా పనిచేస్తున్న వినయ్ కుమార్ సక్సేనా.. త్వరలోనే పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటివరకు ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా కొనసాగిన అనిల్ బైజాల్ ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm