హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి తన కుమారుడిని చంపి తానూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నార్కట్‌పల్లి మండలం ఔరావాణిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. హైదారబాద్ కు చెందిన దొడ్డ లాస్య(23)కు రైల్వే ఉద్యోగి నరేశ్ తో మూడేండ్ల క్రితం వివాహమైంది. ప్రసుతం భర్త హైదరాబాద్ లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. లాస్య మాత్రం ఔరావాణిలో అత్త మామలతో కలిసి ఉంటోంది. అయితే ఏమైందో తెలియదు గానీ ఆమె తన రెండేండ్ల కుమారుడి గొంతు నుమిలి హత్య చేసింది. అనంతరం తానూ ఉరేసుకుని చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm