నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో రియల్ ఎస్టేట్ పేరుతో ఓ వ్యక్తి భారీ మోసానికి పాల్పడ్డాడు. వివరాల్లోకెళ్తే.. డిచ్‌పల్లి మండలం ధర్మారంలో దశరథ్ అనే వ్యక్తి.. వెంచర్‌లో ప్లాట్లు విక్రయిస్తున్నట్టు స్థానికుల వద్ద డబ్బులు సేకరించాడు. అయితే మొత్తం చెల్లింపుల తర్వాతే రిజిస్ట్రేషన్ చేస్తానని నమ్మించాడు. కొందరు డబ్బులు చెల్లించగా.. ఇంకా వారికి స్థలాలు కేటాయించకపోవటంపై వారు దశరథ్‌ని నిలదీశారు. ఈ క్రమంలో ఒత్తిడి పెరగడంతో అతను పరారయ్యాడు. సుమారు ఐదు కోట్ల రూపాయలు సేకరించి పరారయ్యాడని తెలిసింది.
Mon Jan 19, 2015 06:51 pm