హైదరాబాద్ : డ్రైవర్ కు మూర్చరావడంతో పదో తరగతి పరీక్ష రాసేందుకు విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి గోతిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మేడారం వద్ద చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిమేడారం బాలికల గురుకులానికి చెందిన 20 మంది విద్యార్థులు మంగళవారం పదో తరగతి పరీక్ష రాసేందుకు ఒకే ఆటోలో వెళ్తున్నారు. అయితే మార్గమధ్యలో డ్రైవర్‌కు మూర్చరావటంతో వాహనం అదుపుతప్పింది. దాంతో రోడ్డు పక్కనున్న గోతిలోకి ఆటో దూసుకెళ్లింది.
అక్కడే ఆటో ఆగిపోవటంతో విద్యార్థినులకు ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో విద్యార్థినీలు తీవ్రభయాందోళనకు గురయ్యారు. ఎవరికీ గాయలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm