చెన్నై : కోలీవుడ్ స్టార్ హీరో శింబు తండ్రి, దర్శకుడు టి.రాజేందర్ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన్ను మెరుగైన వైద్యం కోసం విదేశానికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని శింబు సోషల్మీడియా ద్వారా ఒక ప్రకటనలో తెలిపారు. తన తండ్రికి ఛాతీలో నొప్పి రావడం వల్ల ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించామన్నారు. అయితే పొత్తికడుపులో రక్తస్రావం అవుతుండటం వల్ల ఆయనకు ఇంకా మెరుగైన వైద్యం అవసరమని వైద్యులు చెప్పారన్నారు. వారి సూచన మేరకు విదేశానికి తీసుకెళ్లామని శింబు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన బాగున్నారని... ట్రీట్‌మెంట్ పూర్తవగానే తిరిగొస్తామని చెప్పారు. అభిమానుల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు అని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm