అమరావతి : కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ అమలాపురంలో హింసాత్మక ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మంత్రి పినిపె విశ్వరూప్, వైసీపీ ఎమ్మెల్యే సతీష్ బాబు ఇండ్లకు ఆందోళనకారులు నిప్పంటించారు. అయితే ఈ ఘటనలపై ఏపీ హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. వారు మాట్లాడుతూ.. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును వ్యతిరేకించడం సబబు కాదన్నారు. కోనసీమ అల్లర్ల వెనుక టీడీపీ, జనసేన ఉన్నాయని ఆరోపించారు. హింసాత్మక ఘటనల్లో 20 మంది పోలీసులకు గాయాలయ్యాయని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm