హైదరాబాద్ : ఓ విద్యార్థినిని లైంగిక వేధించినందుకు కోఠి ఉమెన్స్ కాలేజీ అధ్యాపకుడు అరెస్టయ్యాడు. వివరాల్లోకెళ్తే.. కరీంనగర్ ఓయూలో పీజీ చదువుతున్న విద్యార్థినీని కోఠి ఉమెన్స్ కాలేజీలో సంస్కృతం బోధించే అధ్యాపకుడు ఆదిత్య భరద్వాజ ఆన్ లైన్ లో వేధింపులకు గురిచేశాడు. దాంతో విద్యార్థిని గంగాధర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అద్యాపకుడు ఆదిత్యను వనపర్తిలో అదుపులోకి తీసుకుని కరీంనగర్ కు తరలించారు. నిందితుడిని విచారించిన అనంతరం ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm