హైదరాబాద్ : ప్రేమించి పెండ్లి చేసుకున్న ఓ జంట పై యువతి కుటుంబసభ్యులు దారుణంగా కర్రలతో దాడి చేశారు. ఈ ఘటన ఏపీలోని ఏలూరు జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే.. ఏలూరు జిల్లా దెందులూరు మండలం చల్లచింతలపూడికి చెందిన సాంబశివరావు, పావని మూడు నెలల క్రితం ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. అయితే ఈ వివాహం యువతి కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. ఈ క్రమంలో గత రాత్రి నాగులపల్లి శివార్లలో ఈ జంట ఒక రెస్టారెంటులో ఉండగా వారిపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారు. పావని తండ్రి, తమ్ముడువారి.. సాంబశివరావు చెవి కొరికి కర్రలతో దాడి చేశారు. దాంతో సాంబశివరావు తీవ్రంగా గాయపడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డు అయ్యాయి. అనంతరం ఆ జంట అక్కడి నుంచి తప్పించుకుని ద్వారకా తిరుమల చేరుకుని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై పావని మాట్లాడుతూ.. తమది ఒకే కమ్యూనిటీ అని.. అయినా పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోలేదని తెలిపారు. అయినా తాము వివాహం చేసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం తాము అత్తగారి ఫ్యామిలీ వద్ద ఉంటున్నట్టుగా చెప్పారు. రెస్టారెంట్‌కు వెళ్లిన తమపై తన తండ్రి, తమ్ముడు దాడి చేశారని తెలిపారు. చంపేస్తామని బెదిరించినట్టుగా చెప్పారు. తమకు రక్షణ కావాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 May,2022 09:52PM