హైదరాబాద్ : ఏపిలోని పల్నాడు జిల్లాలోని మాచర్ల మండలం అనుపు కృష్ణా జలాశయం వద్ద మత్స్యకారులు ఆందోళనకు దిగారు. కృష్ణా జలాశయంలో చేపలు పట్టకుండా అధికారులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 50 ఏళ్లుగా కృష్ణా జలాశయంలో చేపలు వేట చేస్తున్నామని, ఇటీవల అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదన చెందారు. కొంతమందికి మాత్రమే కృష్ణా జలాశయంలో చేపల వేటకు అనుమతిస్తున్నారని ఆందోళనకు దిగారు. వేధింపులతో ఉపాధి కోల్పోయి వలస వెళ్లాల్సి వస్తోందని మత్స్యకారులు వాపోయారు.
Mon Jan 19, 2015 06:51 pm