హైదరాబాద్ : త్వరలో వంటనూనెలధరల్లో మరింత ఉపశమనం లభించే అవకాశం ఉంది. పొద్దుతిరుగుడు నూనెల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ, వ్యవసాయ మౌలికవసతుల అభివృద్ధి సెస్ మినహాయిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ఏడాదికి 20 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఈ మినహాయింపు వర్తిస్తుందని ఆర్థిక శాఖ మంగళవారం వెల్లడించింది. ఈ నిర్ణయంతో వంటనూనెల ధరలు తగ్గడంతోపాటు ద్రవ్యోల్బణం కూడా అదుపులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తంచేసింది. మూలాల ప్రకారం ప్రస్తుతం 5శాతం ఉన్న వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్‌ను తగ్గించాలా లేదా తొలగించాలా అనే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ వారంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు.
ఉత్పత్తులపై సెస్ను ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఎడిబుల్ ఆయిల్స్ ధరలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే ఎడిబుల్ ఆయిల్స్పై సుంకాని తగ్గించడంతోపాటు హెర్డింగ్ను నియంత్రించేందుకు నిబంధనలను కఠినతరం చేస్తోంది. అదే సమయంలో ఇండోనేషియా తాజాగా పామాయిల్పై ఎగుమతి నిషేధాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. పామాయిల్ ఎగుమతులపై నిషేధం కారణంగా వంటనూనెల ధరలు పెరిగాయి. ఇప్పుడు ఆంక్షల ఎత్తివేతతో మరోసారి సరఫరా పెరిగి ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 May,2022 09:18AM