హైదరాబాద్ : జమ్ముకశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక పోలీసు అమరుడయ్యారు. చనిపోయిన ముష్కరులు పాకిస్థాన్కు చెందిన వారని అధికారులు ప్రాథమికంగా నిర్ధరించారు. బారాముల్లా జిల్లా క్రీరీ ప్రాంతంలోని నజీభట్ క్రాసింగ్ వద్ద బుధవారం ఉదయం ఈ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, సైన్యం సంయుక్తంగా ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. ముష్కరుల కాల్పుల్లో గాయపడి.. ఓ పోలీసు ప్రాణాలు కోల్పోయారు.
Mon Jan 19, 2015 06:51 pm