హైదరాబాద్ : భూసేకరణ జీవో 80-ఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. వరంగల్ జిల్లా రైతులు బుధవారం హనుమకొండ- హైదరాబాద్ 163 జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ మేరకు ధర్నా నిర్వహించి తమ నిరసన తెలిపారు. జీవోను వెంటనే రద్దు చేయాలని రైతులు నినాదాలు చేశారు. రైతుల నిరసనలో వామపక్ష నేతలు, కాంగ్రెస్, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ ధర్నాతో హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు.
ఇదిలా ఉండగా బుధవారం ఉదయం నుండి రైతులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే ఈ అరెస్టులను రైతు ఐక్య కార్యాచరణ తీవ్రంగా ఖండించింది.
Mon Jan 19, 2015 06:51 pm