హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కోర్టులో ఓ వ్యక్తి కత్తితో హల్ చల్ చేశాడు. అయితే అది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకెళ్తే.. సాయికిరణ్ అనే యువకుడి సోదరిని ఓ వ్యక్తి ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. అనంతరం కొన్ని రోజులకే ఆమెను అతను మోసం చేశాడు. దీనిపై ఫిర్యాదు చేయగా ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో సాయికిరణ్ తన బావను చంపేందుకు కోర్టుకు కత్తితో వచ్చాడు. అతనితో పాటు అతని స్నేహితుడు కూడా ఉన్నాడు. అయితే సిబ్బంది అప్రమత్తమై అతన్ని అడ్డుకున్నారు. సాయికిరణ్‌తో పాటు అతని బావను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm