పన్నా : మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలోని నిస్సార గనిలో ఓ మహిళ 2.08 క్యారెట్ల వజ్రాన్ని కనుగొన్నట్లు అధికారులు బుధవారం తెలిపారు. రాయి నాణ్యమైనదని, వేలంలో రూ.10 లక్షల వరకు పలుకుతుందని వారు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. ఇత్వాకాల గ్రామంలో నివాసముంటున్న చమేలీ బాయి అనే గృహిణి ఇటీవలే జిల్లాలోని కృష్ణ కళ్యాణ్‌పూర్ పాటి ప్రాంతంలో గనిని లీజుకు తీసుకున్నారు. ఈ మేరకు వారి ప్రయత్నాల్లో 2.08 క్యారెట్ల వజ్రాన్ని కనుగొన్నట్టు పన్నా డైమండ్ కార్యాలయ అధికారి అనుపమ్ సింగ్ తెలిపారు. మహిళ మంగళవారం వజ్రాల కార్యాలయంలో విలువైన ఆ డైమండ్ ను డిపాజిట్ చేసినట్టు అధికారి తెలిపారు. రాబోయే వేలంలో వజ్రాన్ని విక్రయానికి ఉంచుతామని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ధరను నిర్ణయిస్తామని చెప్పారు. ప్రభుత్వ రాయల్టీ, పన్నులు మినహాయించిన తర్వాత ఆదాయం మహిళకు ఇస్తామని అధికారులు తెలిపారు.
వజ్రాల మైనింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నామని, ఈ ఏడాది మార్చిలో కృష్ణ కళ్యాణ్‌పూర్ పాటి ప్రాంతంలో ఒక చిన్న గనిని లీజుకు తీసుకున్నామని మహిళ భర్త అరవింద్ సింగ్ తెలిపారు. డైమండ్ వేలం ద్వారా వచ్చిన డబ్బుతో ఇప్పుడు పన్నా నగరంలో ఇల్లు కొనాలని అనుకుంటున్నట్టు చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 May,2022 05:36PM