చెన్నై : తమిళనాడులోని రామనాథపురం జిల్లా రామేశ్వరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ పై ఆరుగురు వలస కూలీలు సామూహిక లైంగికదాడికి పాల్పడి అనంతరం ఆమెను హత్య చేసి దహనం చేశారు. పోలీసులు , స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రామేశ్వరంలోని వడకాడు మత్స్యకార గ్రామంలో కదర్పాసి (సముద్రపు కలుపు) సేకరించడానికి వెళ్లిన 47 ఏండ్ల మత్స్యకార మహిళ మంగళవారం వెళ్లింది. అయితే ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక లైంగికదాడి చేశారు. అనంతరం ఆమెను హత్య చేసి మృతదేహాన్ని తగలబెట్టారు.
అయితే మంగళవారం రాత్రి ఆ మహిళ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు వెతుక్కుంటూ వెళ్లారు. రొయ్యల పెంపకం సమీపంలోని ఏకాంత ప్రదేశంలో పాక్షికంగా కాలిపోయిన ఆమె మృతదేహాన్ని వారు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే బాధితురాలికి న్యాయం చేయాలంటూ స్థానికులు నిరసనకు దిగారు. ఈ క్రమంలో స్థానికులు రొయ్యల ఫారానికి నిప్పంటించారు. అలాగే నేరానికి కారణమని అనుమానిస్తూ కొందరు వ్యవసాయ కార్మికులపై వారు దాడి చేశారు. ఆరుగురు వలస కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. కేసుపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 May,2022 06:53PM