హైదరాబాద్ : ఓ లాడ్జీలో ఇద్దరు పిల్లలతో సహా దంపతులు నిద్రమాత్రలు మింగారు. లాడ్జీ యజమాన్యం స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడకు చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ఈ ఘటన హైదరాబాద్ లోని దిల్సుఖ్నగర్లో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. శశికుమార్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో దిల్సుఖ్నగర్లోని గణేష్ లాడ్జ్కు వచ్చాడు. అనంతరం అందరూ నిద్రమాత్రలు మింగారు. దాంతో లాడ్జ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు.. బాధితులను ఆసుపత్రికి తరలించారు. శశికుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. 2019లో టీఎస్ జెన్కో నుంచి జీవీపీఆర్ సంస్థ రూ.2 కోట్ల కాంట్రాక్టు తీసుకుంది. అయితే సబ్ కాంట్రాక్టు కింద జీవీపీఆర్ సంస్థ.. శశికుమార్కు అప్పగించింది. శశికుమార్ పనులు చేసినా జీవీపీఆర్ ప్రతినిధి ప్రతాప్ రెడ్డి బిల్లులు ఇవ్వలేదని ఆరోపణలు వస్తున్నాయి. డబ్బులు అడిగితే ప్రతాప్ రెడ్డి, అతని కుమారుడు దినేష్రెడ్డి బెదిరింపులకు దిగారని చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 May,2022 07:19PM