హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో దివంగత మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడు కుమారుడు డీకే శ్రీనివాసులు నాయుడును నార్కోటిక్స్ డ్రగ్స్ కంట్రోల్ (ఎన్‌సీబీ) అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. శ్రీనివాసులు నాయుడు రాజకీయ, సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలతో బుధవారం ఎన్‌సీబీ అధికారులు బెంగళూరులోని అతనితో సహా పలువురు ఇండ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో శ్రీనివాసులు నాయుడు ఇంటిలో భారీ ఎత్తున డ్రగ్స్ దొరికినట్టు తెలిసింది.
Mon Jan 19, 2015 06:51 pm