హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు బెంగళూరు వెళ్లనున్నారు. మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడతో పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో ఆయన సమావేశం కానున్నారు. ఉదయం హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు సీఎం బయల్దేరుతారు. దేవెగౌడ నివాసంలో మధ్యాహ్నం 12.30 గంటలకు భేటీ కానున్నారు. జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనురిస్తున్న విధానం సహా తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై దేవెగౌడ, కుమారస్వామితో కేసీఆర్ చర్చించనున్నట్టు తెలుస్తోంది. త్వరలో జరగనున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశం కూడా చర్చించే అవకాశం ఉంది. కేసీఆర్ బెంగళూరు పర్యటన నేపథ్యంలో బెంగళూరులో ఆయన అభిమానులు ఇప్పటికే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కేసీఆర్ సాయంత్రం తిరిగి హైదరాబాద్ రానున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm